pపూర్వకాలం డబ్బులు రాగి నాణేల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేస్తారు. అప్పట్టో నదుల ద్వారా మాత్రమే నీళ్లు పొందేవాళ్లు. మన పూర్వీకులు రాగి నాణేలను నదుల్లోకి విసిరేసే.. సంప్రదాన్ని పాటించేవాళ్లు.రాగి నాణేలను నదుల్లోకి విసిరేయడం వల్ల.. రాగి ఎక్కువకాలం నీటిలో ఉండి.. నీటిని శుద్ధి చేస్తుంది. ఈ కారణంగా.. గుళ్లలో కూడా రాగి పాత్రలు ఉండేవి. రాగి నీటిని.. 99.9 శాతం ప్యూరిఫై చేస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణవ్యవస్థలో చాలా మలినాలు పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి శుభ్రంచేసే వ్యవస్థ కావాలి. దానికి ఉపవాసాన్ని క్లినింగ్ సిస్టమ్ గా మార్చారు.ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో.. జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రమవుతుంది. మనుషుల శరీరం 80 శాతం నీళ్లు, 20 శాతం పదార్థాలతో తయారై ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు.. శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గిపోయి.. శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది.ఉపవాసం డయాబెటిస్, రోగనిరోధకతకు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి.|
మహిళలు బొట్టు పెట్టుకునే భాగం.. ముఖ్యమైన నరం ఉంటుంది. శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది. అలాగే.. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అందుకే పూజల సమయంలో.. బొట్టు పెట్టుకుంటారు.బొట్టు నుదుటిపై పెట్టుకోవడం వల్ల.. ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే.. రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుంది.
ఆడవారు మంగళ సూత్రాలలో పగడాన్నీ ,ముత్యాన్నీ ధరిస్తారు. అవి కేవలం అలంకార ప్రాయంగా కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి. మంగళ సూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. పగడం సూర్యునికి మరియు కుజునికి , ముత్యం చంద్రుని కి ప్రతీకలు. ఆ రెండూ సూర్య, చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది. ముత్యం అతివేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుంది.
గర్భిణి స్త్రీలు శూర టెంకాయ తమిళంలో చిదరు కాయ్ అంటారు దానిని కొట్ట కూడదు ఎందుకంటె అడురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు.
♦️మరు మీ పిల్లలో దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరు దీనిని తప్పక చేస్తుంటారు
♦️ గరహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్నమవడానికి కావలసిన ఆమ్లములు ఉరవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు
♦️మ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.
♦️ మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.
♦️ సత్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు.
♦️ కత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక ముల రాయాలి పసుపు క్రిమి నాసిని.
♦️ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.
♦️ నలుపు రంగు వస్తువులు బట్టలు దరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది
♦️ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము
♦️ పరతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి ఇది పితృ దేవతలకు ప్రీతి కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది
♦️ టంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను
♦️ సత్రీలు ఎప్పుడు జుట్టు విరవ పోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది
♦️ శుక్రవారమునాడు గాని జీతము రాగానేగాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పైపై డబ్బులు చేరటానికి అవకాసము ఎక్కువ
♦️ కలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాల్లాడిస్తూ కూచోవడం ఒంటి కాలితో నిలవడం స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ
♦️ ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ఎడమ చేతిని ఉపయోగించ కూడదు
♦️ సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించ కూడదు
♦️ సత్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు.
♦️ పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు రేపు తీసుకుంటాను అని అనవలెను
♦️ ఎప్పుడు మన నోటినుండి పీడ దరిద్రం శని పీనుగా కష్టము అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు
♦️ ఇంటిలో దుమ్ము ధూలి సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువు పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.
భారతీయ స్త్రీలు మెట్టెలు ధరించడం ఒక సంప్రదాయం. ఐతే ఈ మెట్టెలు ధరించడానికి, అందులోను కాలి రెండవ వ్రేలుకు ధరించడానికి కూడా చక్కని కారణాలు ఉన్నాయి. మెట్టెలు ధరించడం వల్ల ముందు ఆ స్త్రీకి వివాహం అయిందనే విషయం తెలుస్తుంది. ఇక ఆరోగ్య విషయానికొస్తే మెట్టెలు ధరించడం వల్ల గర్భశయానికి చాలా మంచిది. కాలి రెండవ వేలి నుండి గర్భాశయానికి ఒక నాడి అనుసంధానమై ఉంటుంది. గుండెను కూడా ఈ నాడీ కలుపుతుంది.
