హోటల్ ముందు పటాకులు, బాకాల చప్పుళ్లు.. ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం
ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టుకు మెక్సికో టీమ్ అభిమానులు తాజాగా చుక్కలు చూపించారు. వారు బస చేస్తున్న హోటల్ ముందు పటాకులు పేలుస్తూ, బాకాలు ఊదుతూ నానా హంగామా సృష్టించడంతో ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా జరగనున్న మెక్సికో వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. రౌండ్ 16 దశలో భాగంగా సోమవారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం మెక్సికో అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు మెక్సికోకు చేరుకుంది. అయితే, మెక్సికో టీమ్ విజయాన్ని కోరుకుంటున్న అభిమానులు కొంత అత్యుత్సాహం కూడా ప్రదర్శించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
