కోహ్లీ కోపంతోనే విరమణ నిర్ణయం
Bభారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతడు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎన్నో మార్పులు జరిగాయని, ఒత్తిడి వల్లే ఆ నిర్ణయం తీసుకున్నాడంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దానిపై కోహ్లీ అధికారికంగా ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పటికే ఎంతో ఫిట్‌గా ఉన్న విరాట్.. తిరిగి టెస్టుల్లోకి రావాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ టెస్టు రిటైర్మెంట్ గురించి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ ఆటతీరుపై కూడా కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Kకోహ్లీకి ఇంకా టెస్టు క్రికెట్లో ఆడే సామర్థ్యం ఉంది. కానీ ఎందుకు ఆ ఫార్మాట్‌ను అనూహ్యంగా వీడాల్సి వచ్చిందో నాకర్థం కాలేదు. ఇక్కడ 10 వేల పరుగుల విషయం కాదు. విరాట్ ఇంకా క్రికెట్ ఆడగలడు. కానీ అది కోపంలో తీసుకున్న నిర్ణయమేమో అని నాకు అనిపించింది. ఆట విషయంలో ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకూడదు. సెలక్టర్లు ఎంపిక చేయకపోయినా సమస్య లేదు. కాస్త విరామం తీసుకుని తిరిగి రాణించాలి. మోహిందర్ అమర్నాథ్, అన్షుమాన్ గైక్వాడ్ వంటి ప్లేయర్లు అదే చేశారు. కోహ్లీ టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయం నాకు నిరాశ కలిగించింది’ అని కపిల్ దేవ్ వెల్లడించాడు.
కోహ్లీ టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయం నాకు నిరాశ కలిగించింది : కపిల్ దేవ్
అగ్రెషన్ ఎక్కువ..
కోహ్లీ ఆటతీరుపై కూడా కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతని అగ్రెషన్‌ను చూస్తుంటే అమెరికా టెన్నిస్ దిగ్గజం జాన్ మెక్ఎన్రోను గుర్తు చేస్తుందని అన్నారు.
అతని ఆటను జాన్ మెక్ఎన్రో గుర్తొస్తాడు
‘విరాట్‌కు ఆవేశం ఎక్కువ. గేమ్ ఆడుతున్న సేపు ఎగ్జైట్ అవుతాడు. కానీ అతని ఆటను చూస్తే జాన్ మెక్ఎన్రో గుర్తొస్తాడు. అతడు కూడా ఒత్తిడిలోనే ఎక్కువగా రాణిస్తాడు. అగ్రెషన్ లేకుండా తన అత్యుత్తమ ఆట ఆడలేడు. నేను మాత్రం అలా కాదు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్ వంటి ప్లేయర్లు ప్రశాంతంగా ఆడేవారు. కానీ కోహ్లీ మాత్రం తన ఆవేశాన్నే ఆయుధంగా మార్చుకుని ఆడుతాడు” అని కపిల్ దేవ్ తెలిపాడు.
అహంకారం కాదురా.. అది ఆటిట్యూడ్.. రహానే షాకింగ్ కామెంట్స్
కోహ్లీ మౌనం వెనుక ఉన్న అసలు కారణాన్ని రహానే బయటపెట్టారు. సచిన్ రికార్డులు, 2027 వరల్డ్ కప్‌పై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక బ్యాటర్ అవుటై పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు ప్రేక్షకులు పెద్దగా అరవడం తనకు నచ్చదని తెలిపాడు.
కోహ్లీ మౌనం వెనుక అసలు కథ చెప్పిన రహానే !
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశారు. 91 బంతుల్లో 93 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కుమార సంగక్కరను అధిగమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. ఈ నేపథ్యంలో అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
.
దింపడయ్యా ఆ మెరుపుతీగను.. వెయిట్ చేయలేక చచ్చిపోతున్నం.. కోహ్లీ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు
యువ ప్రతిభను సకాలంలో ప్రోత్సహించినప్పుడే భారత క్రికెట్ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుంది. ఇంగ్లాండ్‌తో జరిగే రెండో వన్డే సమరంలోనైనా వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చి, అతనిలోని అసలైన హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని యావత్ క్రికెట్ లోకం కోరుకుంటోంది.
