టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని తాగే విధానం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజువారీ జీవితంలో టీ ఒక భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేవగానే, పనిలో ఒత్తిడి తగ్గించుకోవడానికి, సాయంత్రం సేదతీరడానికి, కొందరు రాత్రి పడుకునే ముందు కూడా టీ తాగుతుంటారు. అయితే, టీని ఎక్కువగా లేదా సరికాని సమయంలో తాగడం వల్ల గుండెల్లో మంట, అసిడిటీ, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మిల్క్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. ఇది కడుపులో ఆమ్లాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ మొత్తంలో టీ తాగితే అన్నవాహిక మధ్య ఉండే కండరం బలహీనపడుతుంది. దీంతో కడుపులోని ఆమ్లం పైకి వచ్చి అసిడిటీ, గుండెల్లో మంటకు కారణమవుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం లేదా రోజంతా పదేపదే టీ తాగడం వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

చాలామంది టీ చల్లారకముందే చాలా వేడిగా తాగేస్తుంటారు. కానీ ఇది గొంతు, అన్నవాహిక లోపలి పొరలను దెబ్బతీస్తుంది. ఇలాంటి అలవాటు చాలా కాలం కొనసాగితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే టీ కొద్దిగా చల్లారిన తర్వాత తాగడం మంచిది.

టీ బ్యాగులతో కూడా జాగ్రత్త
ఇటీవలి కాలంలో టీ బ్యాగుల వినియోగం పెరిగింది. అయితే ప్లాస్టిక్ పూత ఉన్న కొన్ని టీ బ్యాగులను వేడి నీటిలో వేయడం వల్ల సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు టీలో కలిసే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
టీ వల్ల రక్తహీనత వచ్చే అవకాశం
ఐరన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
టీలో ఉండే టానిన్లు శరీరం ఐరన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటే ఐరన్ శోషణ తగ్గి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుంది.
టీ తాగేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
టీ తయారైన తర్వాత కొన్ని నిమిషాలు చల్లారనిచ్చి తాగాలి. రోజుకు 2–3 కప్పుల కంటే ఎక్కువ టీ తాగకూడదు.
ప్లాస్టిక్ టీ బ్యాగులకు బదులుగా టీ ఆకులతో తయారుచేసిన టీ తాగడం మంచిది. ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు మానుకోవాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగకుండా కొంత విరామం ఇవ్వాలి.
రాత్రిపూట టీకి బదులుగా హెర్బల్ టీ లేదా కెఫిన్ లేని పానీయాలు తీసుకోవాలి.
టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మితంగా, సరైన సమయంలో తాగితేనే వాటి ప్రయోజనాలు పొందవచ్చు.
రాత్రిపూట టీ తాగొచ్చా?
రాత్రి సమయంలో టీ తాగితే అందులోని కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల గాఢ నిద్ర తగ్గి మరుసటి రోజు అలసటగా అనిపించవచ్చు. కాబట్టి రాత్రిపూట టీకి బదులుగా కెఫిన్ లేని హెర్బల్ టీలు లేదా ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం మంచిది.

వేడివేడిగా టీ తాగితే ప్రమాదం!.. చాలామంది టీ చల్లారకముందే చాలా వేడిగా తాగేస్తుంటారు. కానీ ఇది గొంతు, అన్నవాహిక లోపలి పొరలను దెబ్బతీస్తుంది. ఇలాంటి అలవాటు చాలా కాలం కొనసాగితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే టీ కొద్దిగా చల్లారిన తర్వాత తాగడం మంచిది.
